శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 11, 2020 , 22:43:36

చిరుతపులి చర్మం సీజ్..ముగ్గురు అరెస్ట్

చిరుతపులి చర్మం సీజ్..ముగ్గురు అరెస్ట్

కరీంనగర్ : చిరుత పులి చర్మాన్ని విక్రయించేందుకు మహారాష్ట్ర నుంచి తెలంగాణకు తీసుకొచ్చిన ముగ్గురు వేటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. చిరుత పులిచర్మంతోపాటు వేటగాళ్లు కొండగొర్ల తిరుపతి, సదమిక్‌ గంగారాం, వెలది తులసీరాంలను  రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్సా గ్రామానికి చేరుకున్న వేటగాళ్లు చిరుత చర్మం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకొని తనిఖీలు చేశారు. ప్రాణహిత నదికి అవతల ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహెరి తాలుకా మరుపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత పులిని చంపిన వేటగాళ్లను టాస్క్‌ఫోర్స్‌ సీఐలు రాజ్‌కుమార్‌, కిరణ్‌, ఎస్‌ఐ మస్తాన్‌తో పాటు సిబ్బంది పకడ్బందీ వ్యూహం పన్ని చిరుతపులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.


logo