సోమవారం 01 జూన్ 2020
Telangana - May 03, 2020 , 17:25:51

చెట్టుపై చిరుత పులి: పరుగు తీసిన రైతులు

చెట్టుపై చిరుత పులి: పరుగు తీసిన రైతులు

కామారెడ్డి: జిల్లాలోని లింగంపేట్‌ మండలంలోని పోతాయిపల్లి వద్ద పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులకు చిరుతపులి కనిపించింది. చెట్టుపై ఉన్న చిరుతను చూసిన రైతులు పనులు వదిలిపెట్టి ఇండ్లకు పరుగులు తీశారు. గ్రామ సర్పంచ్‌ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్‌ అధికారులు చిరుతపులి కోసం గాలిస్తున్నారు. చిరుత సంచరించిన ప్రాంతాలను గుర్తించి బోను ఏర్పాటు చేశారు. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి చిరుత వచ్చి ఉంటుందని అధికారులు తెలిపారు.


logo