శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 10:52:54

రామాయంపేట మండలంలో చిరుత సంచారం

రామాయంపేట మండలంలో చిరుత సంచారం

మెదక్‌ : జిల్లాలోని రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామ పరిసరాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన రంగేరి రత్నం పొలం వద్ద పశువుల కొట్టంలో కట్టేసిన ఆవు దూడపై చిరుత దాడి చేసి చంపేసింది.  ఆవు దూడ చనిపోవడాన్ని గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు.. గ్రామ శివారులో చిరుత అడుగుజాడలను గుర్తించారు. చిరుత సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 


logo