మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 11:41:34

నల్లగొండ జిల్లాలో చిరుత కలకలం.!

నల్లగొండ జిల్లాలో చిరుత కలకలం.!

నల్లగొండ :  నల్లగొండ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. నల్లగొండ మండలం దోమలపల్లి, అప్పాజీపేట గ్రామాల్లో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం రాత్రి గుర్తుతెలియని జంతువు అరుపులు విన్న గ్రామస్తులు అవి చిరుతవేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భయంతో శివారు ప్రాంతాల్లోని వారు కంటిమీద కునుకు లేకుండా జాగారం చేస్తున్నారు.

పశువులను కాసేందుకు వెళ్లేవారు, రాత్రివేళ పొలాల వద్దకు వెళ్లే రైతులు హడలిపోతున్నారు. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు సంచరిస్తున్నది చిరుతా.. హైనా లేక మరో జంతువా గుర్తించేందుకు ఆయా గ్రామాల్లో పలుచోట్ల సీసీ కెమెరాల్లో  ఏర్పాటు చేశారు. శివారు ప్రాంతాల్లో బోన్లను సైతం పెట్టారు. ముందు జాగ్రత్తగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో చాటింపు వేయించారు. రాత్రివేళ ఎవరూ శివారు ప్రాంతాలకు వెళ్లవద్దని, పొలాలకు వెళ్లే రైతులు, జీవాల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. త్వరలో జంతువు ఆనవాళ్లు గుర్తిస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.