శుక్రవారం 05 మార్చి 2021
Telangana - Jan 17, 2021 , 08:04:24

వేములవాడలో చిరుతపులి కలకలం

వేములవాడలో చిరుతపులి కలకలం

రాజన్న సిరిసిల్ల: జిల్లాలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. రెండు రోజుల క్రితం బోయినపల్లి మండలం మల్కాపూర్‌లో కనిపించిన చిరుత, మళ్లీ ఇవాళ తెల్లవారుజామున వేములవాడ అర్బన్‌ మండలంలోని మారుపాక శివారులో సంచరించింది. పొలం పనులకు వెళ్లిన రైతులకు పులి అడుగుల గుర్తులు కనిపించాయి. దీంతో విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. ఈనేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా, రెండు రోజుల క్రితం మల్కాపూర్‌లోని ఓ వ్యవసాయ బావిలో చిరుతపులి పడిపోయింది. అటవీ అధికారులు వచ్చేలోపే ఆ చిరుత అక్కడి నుంచి తప్పించుకున్నది. మళ్లీ మారుపాక ప్రాంతంలో పులి సంచరిస్తుండటంలో ప్రజలు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు.

VIDEOS

logo