సోమవారం 01 జూన్ 2020
Telangana - May 19, 2020 , 07:56:07

జీవీకే గార్డెన్స్‌లో ప్రత్యక్షమైన చిరుతపులి

జీవీకే గార్డెన్స్‌లో ప్రత్యక్షమైన చిరుతపులి

హైదరాబాద్‌: గత వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న చిరుతపులి ఆచూకీ లభించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హిమాయత్‌సాగర్‌ ఒడ్డున ఉన్న జీవీకే గార్డెన్స్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌లో చిరుతపులి నీళ్లు తాగుతుండగా వాచ్‌మెన్‌ గమనించారు. ఈ విషయాన్ని అధికారుల చేరవేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు గార్డెన్‌లో కుక్కలను వదిలి చిరుత కోసం గాలిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో బోనుతోపాటు, సీసీ ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు.

మే 14న నగర శివారులోని కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జ్‌ వద్ద రోడ్డుపై తిరుగుతూ చిరుతపులి కనిపించింది. అయితే అటవీశాఖ అధికారులు దానికి మత్తు ఇచ్చేలోపే అది తప్పించుకుంది. రోడు పక్కనే ఉన్న ఫాంహౌస్‌లోకి వెళ్లిన చిరుతపులి, వ్యవసాయ యూనివర్సిటీలోని దట్టమైన పొదల్లోకి తప్పించుకుపోయింది. దీంతో అప్పటి నుంచి అధికారులు చిరుత ఆచూకీ కోసం గాలిస్తున్నారు.


logo