శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 04, 2020 , 01:21:42

ప్రాణభయంతో చెట్టెక్కిన చిరుత

ప్రాణభయంతో చెట్టెక్కిన చిరుత

లింగంపేట: మామూలుగా చిరుతను చూస్తేనే ఇతర జంతువులు పారిపోతుంటాయి. కానీ అడవి కుక్కలు వెంబడించడంతో ప్రాణరక్షణ కోసం ఓ చిరుత చెట్టెక్కింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోతాయిపల్లిలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామస్థుల వివరాల ప్రకా రం.. పలువురు పశువుల కాపరులు గురువారం పోతాయిపల్లి అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. వారికి సమీపంలో అడవి కుక్కలు అరుస్తుండటంతో పరిసరాలు పరిశీలించగా.. చెట్టుపై చిరుత ఉన్నట్టు గుర్తించారు. వారు ఆ కుక్కలను తరిమేయగా.. చిరుత చెట్టుపైనుంచి దిగి అడవిలోకి వెళ్లింది. ఆదివారం విషయం తెలుసుకున్న అటవీ అధికారులు గ్రామాన్ని సందర్శించి చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పోతాయిపల్లి, నందివాడ గ్రామాల రహదారి సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్టు గుర్తించామని ఎల్లారెడ్డి రేంజ్‌ అధికారి చంద్రకాంత్‌రెడ్డి తెలిపారు. తునికాకు, వంట చెరుకు కోసం అటవీ ప్రాంతానికి వెళ్లొద్దని సూచించారు.


logo