మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 14, 2021 , 09:17:03

ఆ బావిలో ప‌డ్డ చిరుత ఎక్క‌డిది?

ఆ బావిలో ప‌డ్డ చిరుత ఎక్క‌డిది?

బోయినపల్లి(రాజ‌న్న సిరిసిల్ల‌): బోయినపల్లి మండలంలో చిరుత కలకలం రేపింది. మల్కాపూర్‌లో బుధవారం ఓ వ్యవసాయబావిలో పడి దడ పుట్టించింది. అయితే బోయినపల్లి మండలం అటవీప్రాంతం కాకపోవడం, గతంలో ఎప్పుడూ సంచరించిన దాఖలాలు లేకపోవడంతో ఇంతకీ ఈ చిరుత ఎక్కడి నుంచి వచ్చిందనే ఆందోళన మండలంలో మొదలైంది. మల్కాపూర్‌ గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఫారెస్ట్‌ ఉంటుంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ, వేములవాడ రూరల్‌ మండలం ఫాజుల్‌ నగర్‌, నూకలమర్రి, చందుర్తి మండలంలో అటవీ ప్రాంతాలుంటాయని వేములవాడ ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి సౌమ్య తెలిపారు. ఐదు నెలల క్రితం చందుర్తి మండలం తిమ్మాపూర్‌ గుట్ట పైన అటవీ శాఖ ఆధ్వర్యంలో చేసిన ప్లాంటేషన్‌లో చిరుత పులి అడుగులు కనిపించాయని గ్రామస్తులు తెలిపినట్లు ఆమె చెప్పారు. కొడిమ్యాల, చందుర్తి అటవీ ప్రాంతంలో ఉన్న చిరుత పులి ఇక్కడికి వచ్చి వ్యవసాయ బావిలో పడి ఉండవచ్చని ఆమె చెప్పారు. మల్కాపూర్‌ గ్రామానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాస్‌, స్పెషల్‌ పార్టీ నిజామొద్దీన్‌, మోహన్‌లాల్‌, అటవీ శాఖ సెక్షన్‌ అధికారులు శ్రీనివాస్‌, సౌమ్య, శ్రీనివాస్‌, బీట్‌ ఆఫీసర్లు అనిత, సమీన సిబ్బంది ఉన్నారు.



logo