శనివారం 04 జూలై 2020
Telangana - May 28, 2020 , 18:26:07

నల్లగొండలో చిక్కిన చిరుత.. హైదరాబాద్‌ తరలిస్తుండగా మృతి

నల్లగొండలో చిక్కిన చిరుత.. హైదరాబాద్‌ తరలిస్తుండగా మృతి

హైదరాబాద్‌: నల్లగొండ జిల్లాలోని మర్రిగూడలో ఈ రోజు ఉదయం అటవీ శాఖ అధికారులు బంధించిన చిరుత మృతిచెందింది. హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలో చిరుత మృతిచెందినట్లు నెహ్రూ జంతుప్రదర్శనశాల క్యూరేటర్‌ తెలిపారు. మృతిచెందిన చిరుతకు పశువైద్యుల బృదం శవపరీక్ష నిర్వహించింది. మర్రిగూడ మండలం రాజపేట తండా పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా చిరుత తిరుగుతున్నది. దీంతో తండా సమీపంలోని ఓ రైతు తన పొలానికి రక్షణగా కంచె ఏర్పాటు చేశాడు. చిరుత ఈ రోజు ఉదయం అందులో చిక్కింది. దీంతో రైతులు అటవీశాఖ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. ఉచ్చులో ఉన్న చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరు అటవీ అధికారులు గాయపడ్డారు. చివరకు మత్తు మందు ఇచ్చి చిరుతను బంధించారు. స్పృహ కోల్పోయిన చిరుతను అటవీశాఖ అబులెన్సులో హైదరాబాద్‌కు తరలిస్తుండగా అది మరణించింది. 


logo