ఆదివారం 24 జనవరి 2021
Telangana - Nov 24, 2020 , 21:30:37

చెరకు తోటలో పులి పిల్ల లభ్యం

చెరకు తోటలో  పులి పిల్ల లభ్యం

హవేళి ఘనపూర్‌:  రైతు చెరుకు నరుకుతున్న సమయంలో పులి పిల్ల కనిపించడంతో వెంటనే  అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. అటవీ సిబ్బంది వచ్చి చూడగా అది ముందుగా పిల్లి పిల్లగా అనుమానించినా, చివరకు ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లగా పులి పిల్లగా  నిర్ధారణ అయింది.   ఈ ఘటన మెదక్‌ జిల్లా హవేళి ఘనపూర్‌ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌ గ్రామ శివారులో చోటుచేసుకుంది. 

సుల్తాన్‌పూర్‌ గ్రామానికి చెందిన రైతు చెరుకు నరుకుతున్న సమయంలో పులి పిల్లగా అనుమానించిన రైతులు, మెదక్‌ జిల్లా ఫారెస్టు రేంజ్‌ అధికారి శ్రీనివాస్‌నాయక్‌కు సమాచారం అందించారు. ఆయన అక్కడకు చేరుకొని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో చివరకు ఉన్నతాధికారులు పులి పిల్లగానే గుర్తించడంతో దానిని హైదరాబాద్‌ జూపార్కుకు తరలించినట్లు ఫారెస్టు రేంజ్‌ అధికారి శ్రీనివాస్‌నాయక్‌ తెలిపారు.

పులి సంచరించే అవకాశం ఉన్నందున, పరిసర ప్రాంత ప్రజలు రాత్రివేళల్లో పొలాల వద్దకు వెళ్లకూడదని సూచించారు. ఈ విషయం తెలుసుకున్న పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. logo