మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 13:31:01

ప్రాజెక్టులపై కావాలనే కాంగ్రెస్‌ నేతల రాద్ధాంతం : గుత్తా సుఖేందర్‌రెడ్డి

ప్రాజెక్టులపై కావాలనే కాంగ్రెస్‌ నేతల రాద్ధాంతం : గుత్తా సుఖేందర్‌రెడ్డి

నల్లగొండ : ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ నేతల చర్యలపై మండలి చైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ.. తొమ్మిదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఎస్‌ఎల్‌బీసీని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత రూ.943 కోట్లు ఎస్‌ఎల్‌బీసీపై ఖర్చుపెట్టినట్లు తెలిపారు. ఇప్పటిదాకా ఎస్‌ఎల్‌బీసీ సొరంగం 33 కిలోమీటర్లు పూర్తి అయిందన్నారు. 

కాంగ్రెస్‌ పాలనలో మంత్రులుగా చేసిన జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా ఒక్కమాట మాట్లాడలేదన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటా వినియోగానికి సీఎం కేసీఆర్‌ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పమన్నారు. డిండి ఎత్తిపోతల పథకంతో దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు నీళ్లు ఇస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంకనే పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.

తాజావార్తలు


logo