శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 11, 2021 , 17:58:03

‘యాసిడ్‌ దాడి బాధితులకు అండగా న్యాయ సేవాధికార సంస్థ’

‘యాసిడ్‌ దాడి బాధితులకు అండగా న్యాయ సేవాధికార సంస్థ’

హైదరాబాద్‌ : యాసిడ్ దాడి బాధితులకు అన్నివిధాలా సాయం అందించేందుకు న్యాయ సేవాధికార సంస్థ నిత్యం సిద్ధంగా ఉంటుందని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సీనియర్ సివిల్ జడ్జి కే మురళీ మోహన్ అన్నారు. సిటీ సివిల్ కోర్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఫిల్మ్ నగర్ కమ్యూనిటీ హాల్‌లో ‘యాసిడ్‌ దాడి బాధితులకు న్యాయసేవ’ అనే అంశంపై లీగల్ అవేర్‌నెస్ క్యాంపు నిర్వహించారు.

ఈ సందర్భంగా జడ్జి మురళీ మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాసిడ్ దాడి బాధితుల పరిహార చట్టంపై అవగాహన కల్పించారు. రాజ్యాంగ హామీలు సుప్రీంకోర్టు ఆదేశాలు, బాధితుల సంరక్షణ, పునరావాస ఖర్చుల చెల్లింపు తదితర అంశాలను వివరించారు. అనంతరం ప్యానెల్ లాయర్‌, పారా లీగల్ వలంటీర్లు ఆర్‌వీ ఇందిరా కుమారి, పీ సరోజలు న్యాయ సేవా సంస్థల చట్టం, మహిళా హక్కుల గురించి చెప్పారు. బాధితులకు లీగల్ సర్వీసెస్ అథారిటీ అన్నివిధాలా సాయం చేస్తుందని భరోసా ఇచ్చారు.  శిబిరంలో 70 మంది మహిళలు, ట్రాన్స్‌జెండర్లు లబ్ధి పొందారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు 10 లేబర్ కార్డులు జారీ చేశారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo