మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 18:01:53

కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరికలు

కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరికలు

పెద్దపల్లి : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పలు పార్టీల నుంచి జోరుగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా ధర్మారం మండలం రామయ్యపల్లె  గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 50 మంది కార్యకర్తలు, ముఖ్య నాయకులు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో  వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో ప్రతి కార్యకర్తకు సముచిత నాయ్యం కల్పిస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.