బుధవారం 03 జూన్ 2020
Telangana - May 24, 2020 , 11:53:27

ఇంట్లో అవసరమయ్యే ఆకు కూరలు నేనే పండిస్తా : మంత్రి సత్యవతి

ఇంట్లో అవసరమయ్యే ఆకు కూరలు నేనే పండిస్తా : మంత్రి సత్యవతి

మహబూబాబాద్‌ : తమ ఇంట్లో అవసరమయ్యే ఆకుకూరలను తానే స్వయంగా పండిస్తున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. సీజనల్‌ వ్యాధుల నివారణలో భాగంగా పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మహబూబాబాద్‌లోని తన నివాసంలో మంత్రి పూల కుండీల్లో ఉన్న నిల్వ నీటిని తొలగించారు. దర్వాజలకు కట్టిన తోరణాల ఎండుటాకులను తీసేశారు. మేడ మీద ఉన్న చెత్తా, చెదారాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ... తాను కేటీఆర్‌కు పెద్ద అభిమానినని తెలిపారు. రోజూ తానే ఇంట్లో క్లీనింగ్‌ చేస్తానన్నారు. మొక్కలు నీరు పోయడం, ఇంట్లోకి కావాల్సిన ఆకు కూరలను స్వయంగా పండిస్తున్నట్లు తెలిపారు.

ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలంతా ఎవరింటిని వారు శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందన్నారు. మన ఇంటినే మనం బాగు చేసుకోలేనప్పుడు బయట ఏం బాగు చేయగలమన్నారు. మంత్రితో పాటు ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, మునిసిపల్ కమిషనర్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీటీసీ మధుకర్ రెడ్డి, టిఆర్ఎస్ నేతలు నూకల శ్రీరంగారెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీరామ్ ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.logo