బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 18, 2020 , 18:05:51

కాంగ్రెస్‌ను వీడి కారెక్కిన నేతలు

కాంగ్రెస్‌ను వీడి కారెక్కిన నేతలు

జోగుళాంబ గద్వాల : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే వివిధ పార్టీలకు చెందిన నాయకులు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం పిలుపునిచ్చారు. బుధవారం అలంపూర్‌ చౌరస్తాలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో వడ్డేపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కరుణ, కౌన్సిలర్లు మాణిక్యం రవి, లలిత, ధనలక్ష్మితోపాటు దాదాపు 250 మంది కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆయన సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అందరం కలిసికట్టుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని  తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.