బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 12:31:01

కాంగ్రెస్ ను వీడి కారెక్కుతున్న నేతలు

కాంగ్రెస్ ను వీడి కారెక్కుతున్న నేతలు

వనపర్తి : సీఎం కేసీఆర్‌ అందిస్తున్న జనరంజక పాలనను చూసి వివిధ పార్టీల నుంచి జోరుగా టీఆర్ఎస్ లో చేరుతున్నారు. జిల్లాలోని పాన్ గల్ మండలం బండపల్లి గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పీసీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రాంమ్మూర్తి నాయుడు, సర్పంచ్ రాజేశ్వరమ్మ, మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి, నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ని వీడి కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. 

వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ..రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. నిరుపేదల సంక్షేమం కోసం ప్రవేశ పెడున్న ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.


logo