బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 06:37:58

నాయిని మృతిపై నేతల దిగ్భ్రాంతి

నాయిని మృతిపై నేతల దిగ్భ్రాంతి

హైదరాబాద్‌ : తెలంగాణ తొలి హోంమంత్రి, కార్మిక నేతగా విశేష సేవలందించిన నాయిని నర్సింహారెడ్డి చికిత్స పొందుతూ హాస్పిటల్‌లో మృతి చెందగా.. నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ హోంమంత్రి మృతికి మంత్రి ఈటల రాజేందర్‌ సంతాపం ప్రకటించారు. ఉద్యమ సమయంలో నాయినితో ఉన్న అనుబంధం మరువలేనిదన్నారు. ఆయన లేని లోటు పార్టీకి, తెలంగాణ సామాజానికి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబాన్ని సంతాపం ప్రకటించారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నాయిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హోంమంత్రిగా, కార్మిక నేతగా విశేష సేవలందించారని గుర్తు చేసుకున్నారు. ఆయన లేని లోటు పూడ్చలేదన్నారు. కుటుంబానికి సంతాపం ప్రకటించారు.

మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. జూబ్లీహిల్స్‌ అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నాయిని.. బుధవారం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో 12.25 గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. గత నెల 28వ తేదీన కరోనా బారినపడిన ఆయన బంజారాహిల్స్‌లోని సిటీన్యూరో సెంటర్‌ దవాఖానలో 16 రోజులపాటు చికిత్స పొందారు. వారంరోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ వచ్చినప్పటికీ.. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో కుటుంబసభ్యులు అపోలో దవాఖానకు తరలించారు. అప్పటినుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందారు. బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అపోలో దవాఖానలో నర్సింహారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కానీ రాత్రి పొద్దుపోయాక నాయిని ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూశారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.