శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 13:25:36

టీఆర్ఎస్ లో చేరిన వివిధ పార్టీల నేతలు

 టీఆర్ఎస్ లో చేరిన వివిధ పార్టీల నేతలు

 నిజామాబాద్ : టీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని నిజామాబాద్ అర్బన్ కు చెందిన బీజేపీకి చెందిన 27వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి నారాయణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరారు. అలాగే డిచ్ పల్లి మండలం ధర్మారం (బి) కాంగ్రెస్ ఎంపీటీసీ నర్సింగరావు ఎమ్మెల్యే బాజిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి మంత్రి వేముల, ఎమ్మెల్యేలు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే టీఆర్ఎస్ లో చేరామన్నారు.