శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 09, 2020 , 01:01:12

టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు


నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: టీఆర్‌ఎస్‌లోకి చేరికలు కొనసాగుతున్నాయి. శనివారం ఆయా జిల్లాల్లో ప్రధాన పార్టీలకు చెందిన  నాయకు లు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు.  సూ ర్యాపేటలో పెన్‌పహాడ్‌ మండలం నారాయణగూడెం తాజామాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ నాతాల జానకీరెడ్డితోపాటు సుమారు 220 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు మంత్రి జగదీశ్‌రెడ్డి,రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు.   నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఎనుగులదోరి సర్పంచ్‌ మహేశ్వరం సతీష్‌తోపాటు వార్డు సభ్యులు, వివిధ పార్టీలకు చెందిన 50 మంది జెడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షం లో, నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ కాంగ్రెస్‌ ఇంచార్జి, టీపీసీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి జగన్‌మోహన్‌రెడ్డితోపాటు కోడేరు మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు లింగస్వామి, నాగులపల్లి సర్పంచ్‌ వెంకటస్వామి, 100 మంది కోడూ రు మండలం నాగులపల్లిలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సమక్షంలో, నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు బోధన్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ సమక్షంలో, జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం వీరాపూర్‌కు చెందిన రైతు నాయకులు, గౌడ వర్గీయులు ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. 


logo