గురువారం 02 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 00:56:24

లాభాలు వచ్చే పంటలే వేయాలి

లాభాలు వచ్చే పంటలే వేయాలి

  • విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి

వికారాబాద్‌/పరిగి : ప్రతిరైతును ఉన్నతస్థానంలో నిలిపేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్‌, పరిగిలో జరిగిన వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక, నూతన వ్యవసాయ విధానం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు . మంత్రి మాట్లాడుతూ.. డిమాండ్‌ లేని మక్కజొన్న సాగు వద్దని.. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న కంది పంట సాగే మేలని రైతులకు సూచించారు. సాధ్యమైనంత త్వరగా పాలమూరు ఎత్తిపోతల సైతం పూర్తి చేస్తామని సీఎం  తెలిపారన్నారు. ఈ సందర్భంగా వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధి మద్గుల్‌చిట్టంపల్లి వద్ద రూ.కోట్లతో నిర్మించిన పంచాయతీరాజ్‌ రిసోర్ట్స్‌ సెంటర్‌ను మంత్రి జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.


logo