ఆదివారం 23 ఫిబ్రవరి 2020
చంద్రబాబు ఆస్తుల కేసుపై 26న నిర్ణయం

చంద్రబాబు ఆస్తుల కేసుపై 26న నిర్ణయం

Feb 15, 2020 , 08:30:17
PRINT
చంద్రబాబు ఆస్తుల కేసుపై 26న నిర్ణయం

హైదరాబాద్ : ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఆదాయానికి మించిన ఆస్తులపై దర్యాప్తుచేపట్టాలని లక్ష్మీపార్వతి దాఖలుచేసిన ఫిర్యాదుపై ఈ నెల 26న నిర్ణయం తీసుకొంటామని హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టు వెల్లడించింది. కేసు ఇంకా ఫిర్యాదు దశలోనే ఉన్నందున చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు వినాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. సివిల్‌, క్రిమినల్‌ కేసుల దర్యాప్తులో విధించిన స్టేలు ఆరునెలలకు మించి కొనసాగరాదని గత ఏడాది సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాత మళ్లీ హైకోర్టు నుంచి స్టే పొందారా? లేదా? అనే అంశాన్ని కోర్టు పరిశీలించనున్నది.logo