శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 01, 2020 , 22:20:32

జడ్జిల నియామకం.. తెలంగాణకు ఒకరు.. ఏపీకి ముగ్గురు

జడ్జిల నియామకం.. తెలంగాణకు ఒకరు.. ఏపీకి ముగ్గురు

హైదరాబాద్‌ : సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. తెలంగాణ హైకోర్టుకు ఒక న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులను నియమించారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ విజయసేన్‌ రెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ కృష్ణమోహన్‌, జస్టిస్‌ సురేశ్‌ రెడ్డి, జస్టిస్‌ లలితకుమారి నియామకం అయ్యారు. రాష్ట్రపతి ఆమోద ముద్రతో అధికారికంగా నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ ప్రకటన చేసింది. 

పిపిఆర్ కాలేజ్ ఆఫ్ లా నుంచి ఎల్‌ఎల్‌బి పట్టా పొందారు. విజయసేన్ రెడ్డి 1994 లో ఏపీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా చేరారు. హైకోర్టులో కేసులను తీసుకునే ముందు సబార్డినేట్ కోర్టులు మరియు ట్రిబ్యునళ్లలో ప్రాక్టీస్ చేశారు విజయసేన్ రెడ్డి.

విజయసేన్ రెడ్డి 25 సంవత్సరాలకు పైగా వివిధ శాఖలలో ప్రాక్టీస్ చేశాడు. విజయసేన్ రెడ్డి తండ్రి దివంగత బి. సుభాషన్ రెడ్డి మద్రాస్, కేరళ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. సుభాషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మొదటి ఛైర్మన్ గా సేవలందించారు.


logo