శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 18, 2020 , 01:58:20

యువకుడిపై లావణ్య త్రిపాఠి ఫిర్యాదు

యువకుడిపై లావణ్య త్రిపాఠి ఫిర్యాదు

-విచారణ చేపట్టిన సీసీఎస్‌ సైబర్‌క్రైం పోలీసులు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న యువకుడిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ సినిమా హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి హైదరాబాద్‌ నగర పోలీసులను ఆశ్రయించారు. తనను పెండ్లి చేసుకొన్నానని, తనతో తిరిగానంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని సీసీఎస్‌ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదుచేశారు. సీసీఎస్‌ సైబర్‌క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈసీఐఎల్‌ ప్రాంతానికి చెందిన యువకుడు కొన్ని సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించాడు. యూట్యూబ్‌ చానల్‌ ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠిని పెండ్లి చేసుకొన్నానని చెప్పిన అంశం వైరల్‌ అయింది. దీనిని గుర్తించిన హీరోయిన్‌.. సదరు యువకుడిపై తన సహాయకుడి ద్వారా సీసీఎస్‌ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసుకొన్న ఎస్సై మదన్‌గౌడ్‌.. ఆయా చానళ్లకు నోటీసులు జారీచేసి వారినుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఇంటర్వ్యూ చేసింది, వైరల్‌ చేసింది ఎవరనే విషయాన్ని గుర్తించే పనిలోపడ్డారు. మంగళవారం పలువురు సీసీఎస్‌ సైబర్‌క్రైం పోలీసుల ఎదుట హాజరై వివరణ ఇచ్చినట్టు తెలిసింది. లావణ్య త్రిపాఠిపై యువకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన లింకులను తొలగించినట్టు సమాచారం.


logo