సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Aug 23, 2020 , 18:27:33

ఖమ్మం పట్టణంలో మోడ్రన్ టాయిలెట్స్ ప్రారంభం

 ఖమ్మం పట్టణంలో మోడ్రన్ టాయిలెట్స్ ప్రారంభం

ఖమ్మం : మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన మోడ్రన్ టాయిలెట్స్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. గొల్లగూడెం రోడ్(మమత x రోడ్), చర్చ్ కాంపౌండ్ లోని గాంధీ పార్క్, గాంధీ చౌక్ లోని మహిళా కళాశాల వద్ద నిర్మించిన మోడ్రన్ టాయిలెట్స్ ను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు సరిపడా పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులో ఉండేలా చూస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆగస్ట్ 15వ తేదీన రెండు డివిజన్లలో టాయిలెట్స్ ప్రారంభించామని, కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో అనువైన ప్రదేశాల్లో ఆయా నిర్మణాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.


ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖమ్మం ప్రజలకు సరిపడు టాయిలెట్స్ అతి త్వరలో నిర్మించి అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ లు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.


logo