సోమవారం 25 మే 2020
Telangana - Mar 31, 2020 , 20:02:59

పారిశుద్ధ్య కార్మికుల కోసం భోజన కేంద్రం ప్రారంభం

పారిశుద్ధ్య కార్మికుల కోసం భోజన కేంద్రం ప్రారంభం

వరంగల్, మార్చి 31 : ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ కట్టడిలో రాష్ట్ర పారిశుద్ధ్య కార్మికుల సేవలు చాలా గొప్పగా ఉన్నాయని  మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సేవలందించే వారు ఎలాంటి వసతుల లేమితో ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.  వరంగల్ జిల్లా, వరంగల్ ఈస్ట్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత మధ్యాహ్న భోజన కేంద్రాన్ని మంత్రి  ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసిఆర్  ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండేందుకు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు.  ఈ కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం లాక్ డౌన్ ప్రకటించిన సందర్భంగా రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఆకలి బాధ ఉండకుండా ఉండాలని నిత్యావసర సరుకులు, నగదు మొత్తం అన్ని వర్గాల వారికి అందిస్తున్నామని,  మధ్యాహ్న భోజన కేంద్రం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు. 


logo