స్పాట్లోనే సాక్ష్యాల సేకరణ

- డాటా సీసీటీఎన్‌ఎస్‌తో లింకప్
హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ప్రమాదాల సమయంలో పోలీసులు సహాయకచర్యలు చేపడుతూనే.. మరోవైపు సాక్ష్యాధారాల సేకరణను పూర్తి చేయనున్నా రు. స్పాట్లోనే పూర్తి సమాచారంతో ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ సైతం నమోదుచేయనున్నా రు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ఈ టెక్నాలజీ వినియోగంలోకి తీసుకువస్తున్నారు. అడిషనల్ డీజీ టెక్నికల్ సర్వీసెస్ రవిగుప్తా ఆధ్వర్యంలో ఇందుకు యాప్ రూపొందిస్తున్నారు. ఈ నెలాఖరువరకు ఇది అందుబాటులోకి రానున్నదని రవిగుప్తా ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఇప్పటికే పోలీసులు టీఎస్‌కాప్ యాప్‌ను వినియోగిస్తున్నా రు. అందులోనే ఈ కొత్త యాప్ ను జత చేయనున్నారు. సీసీటీఎన్‌ఎస్‌తో ఇది జోడిం చి ఉండటంతో ప్రమాద స్థలానికి వెళ్లిన పోలీ సు అధికారి ఆ ప్రమాద వాహనాలు, క్షతగాత్రుల ఫొటోలు, వీడియోలు యాప్‌ద్వారా అప్లోడ్ చేస్తే అవి ఆ సర్వర్‌కు వెళ్తాయి. ఘటనకు బాధ్యులు, బాధితులు ఇలా అందరి వివరాలు, ఏయే సెక్షన్ల కింద కేసు నమో దు చేయాలన్న వివరాలు దాదాపు స్పాట్లోనే ఈ యాప్‌ద్వారా అప్లోడ్ అవుతాయి. అవే వివరాలు ఎఫ్ఐఆర్లో నమోదవుతా యి. దీంతో కేసు దర్యాప్తులో సాక్ష్యాల తారుమారుకు అవకాశం ఉండకపోగా, కోర్టుకు సైతం పక్కాగా సాక్ష్యాలు సమర్పించేందుకు వీలుంటుంది.