సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 00:10:11

12 రోజుల్లో ఈసెట్‌ ఫలితాలు

12 రోజుల్లో ఈసెట్‌ ఫలితాలు

  • ప్రశాంతంగా ఈసెట్‌ .. 90.83% మంది హాజరు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో లాటరల్‌ ఎంట్రీ కోసం ఈసెట్‌-2020ని సోమవారం విజయవంతంగా నిర్వహించారు. ఫలితాలను 12 రోజుల్లో విడుదల చేసే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఉదయం, మధ్యా హ్నం కలిపి 90.83%  మంది హాజరు నమోదైనట్టు ఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ మంజూర్‌హుస్సేన్‌ తెలిపారు. మొత్తం 28,016 మంది ఈ సెట్‌కు రిజిస్టర్‌ చేసుకోగా, 25,448 మంది పరీక్ష రాశారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి, వైస్‌చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, సెక్రటరీ శ్రీనివాసరావు కేంద్రాలను పర్యవేక్షించారు. కొవిడ్‌ నిబంధనలు పాటించామని, మాస్కులు లేని విద్యార్థులకు వాటిని పంపిణీ చేశామని మంజూర్‌హుస్సేన్‌ తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఎంసెట్‌, ఐసెట్‌తోపాటు ఇతర ప్రవేశ పరీక్షలనూ ఆటంకాలు లేకుండా నిర్వహిస్తామని పాపిరెడ్డి తెలిపారు.


logo