శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 28, 2020 , 12:24:57

ఏడో నిజాం కుమార్తె బషీరున్నిసా బేగం క‌న్నుమూత

ఏడో నిజాం కుమార్తె బషీరున్నిసా బేగం క‌న్నుమూత

హైద‌రాబాద్ : ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సంతానంలో బ్ర‌తికున్న ఏకైక వ్య‌క్తి, ఆయ‌న కుమార్తె  బ‌షీరున్నిసా బేగం(93)  కన్నుమూసింది. అనారోగ్యం కార‌ణంగా ఆమె ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. బ‌షీరున్నిసా బేగం 1927లో జన్మించారు. ఆమెకు అలీ పాషాగా పేరొందిన‌ నావాబ్ కాసిం యార్ జంగ్‌తో వివాహం జ‌రిగింది. వీరికి ఓ కుమార్తె ఉంది. పేరు ర‌షీదున్నిసా బేగం. పురాణీ హ‌వేలీలో నివ‌సిస్తున్నారు. అలీ పాషా 1998లో మ‌ర‌ణించారు. బ‌షీరున్నిసా బేగం మరణం పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె భౌతిక‌కాయాన్ని సంద‌ర్శించి నివాళుల‌ర్పిస్తున్నారు. జోహార్ ప్రార్థ‌న‌ల అనంత‌రం అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. పాత‌బ‌స్తీలోని ద‌ర్గా యాహియా పాషా స్మ‌శాన‌వాటిక‌లో అంత్య‌క్రియ‌లు జ‌ర‌నున్నాయి.


logo