బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 03:15:42

ఏడో నిజాం కూతురు కన్నుమూత

ఏడో నిజాం కూతురు కన్నుమూత

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఏడో నిజాం రాజు మీర్‌ఉస్మాన్‌ అలీఖాన్‌ కూతురు సాహెబ్‌జాదీ బషీరున్ని సాబేగం సాహెబా (93) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌ పురానాపూల్‌లోని తన నివాసంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. 1927లో జన్మించిన ఆమె ఏడో నిజాం చివరి సంతానం. నిజాం స్టేట్‌ మ్యూజియం ఆవరణలోని పురానీహవేలీ ఉస్మాన్‌ కాటేజీలో నివాసముంటున్నారు.  బషీరున్నిసా బేగం సాహెబాకు కూతురు రషీదున్నిసా బేగం ఉన్నారు. పలువురు నిజాం కుటుంబసభ్యులు, వారి సన్నిహితులు ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు.


logo