గురువారం 02 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 10:18:04

సంతోష్‌బాబు పార్థివదేహానికి ప్రముఖుల నివాళి

సంతోష్‌బాబు పార్థివదేహానికి ప్రముఖుల నివాళి

సూర్యాపేట:  కల్నల్‌ సంతోష్‌బాబు పార్థివదేహానికి పలువురు ప్రముఖులు  నివాళులర్పించారు. శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రి జగదీశ్‌ రెడ్డి,  ఎంపీలు లింగయ్య యాదవ్‌, బండి సంజయ్‌, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, ఎమ్మెల్యేలు కిషోర్‌ కుమార్‌, సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులు సంతోష్‌బాబు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.  

సంతోష్‌ అంతిమయాత్రలో పాల్గొనేందుకు  ప్రజలు భారీగా తరలివచ్చారు. సంతోష్‌ బాబు అమర్‌ రహే అంటూ బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేసారంలోని  వ్యవసాయక్షేత్రంలో సైనిక అధికార లాంఛనాలతో సంతోష్‌ బాబు అంత్యక్రియలు నిర్వహిస్తారు. సూర్యాపేటలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నారు. 


logo