గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 24, 2020 , 03:23:19

అంతా అయిపోయింది!

అంతా అయిపోయింది!

  • ఏఈలు మోహన్‌, సుందర్‌ మధ్య చివరి సంభాషణ

మహబూబ్‌నగర్‌ ప్రతినిధి,నమస్తే తెలంగాణ: విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేయడమే తెలిసిన ఇద్దరు ఇంజినీర్లు.. తమ ప్రాణాలు కోల్పోతామని తెలిసినా చివరివరకు ప్లాంట్‌ కాపాడడానికే ప్రయత్నించారు. ఏఈలు సుందర్‌నాయక్‌, మోహన్‌కుమార్‌ మధ్య జరిగిన సంభాషణ వీడియో దీనిని స్పష్టంచేస్తున్నది. జలవిద్యుత్‌ కేంద్రంలో ప్రమాదం సమయంలో ఎంసీఆర్‌ ప్యానల్‌ వద్ద ఉన్న సుందర్‌ సహోద్యోగి మోహన్‌కుమార్‌తో మాట్లాడిన మాటలు తన సెల్‌ఫోన్‌లో రికార్డయ్యాయి. వాటిని చూసిన కుటుంబీకులు, అధికారులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 

ఏఈల సంభాషణ ఇలా సాగింది..

సుందర్‌: మనం లోపల ఉంటే అయిపోతాం కదా.

మోహన్‌: ఎట్లా మరి.. కొద్దిసేపు ఆలోచించుకుని పోదాం.

సుందర్‌: ఇంకా ఆలోచిస్తే ఎక్కువైపోతయి.

మోహన్‌: సరే.. ఇంక ఆశలు వదిలేసుకున్నవ్‌ కదా..

సుందర్‌: కష్టం.. అయిపాయే మన పని. మోహన్‌ వదులుకో ఆశలు వదలుకో.

నలుగురిని కాపాడి..

జలవిద్యుత్‌కేంద్రంలో జరిగిన ప్రమాదంలో నలుగురిని కాపాడి తాను ప్రాణాలు కోల్పోయారు ఏఈ ఉజ్మాఫాతిమా. శ్రీశైలం విద్యుత్‌ కేంద్రం ప్రమాదంలో మరణించిన తొమ్మిదిమందిలో 26 ఏండల ఉజ్మా ఒకరు. మంటలు చెలరేగడాన్ని గమనించిన ఫాతిమా తన ప్రాణాలకు రిస్క్‌ ఉందని తెలిసికూడా.. నలుగురు సిబ్బందిని బయటకు పంపించి తాను మాత్రం మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారని ఉద్యోగులు తెలిపారు. logo