గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 02:52:01

నా బిడ్డల్ని కాపాడుకుంటా

నా బిడ్డల్ని కాపాడుకుంటా

  • రాబోయేవి ప్రమాదకరమైన రోజులు
  • లష్కర్‌ బోనాల్లో స్వర్ణలత భవిష్యవాణి

బేగంపేట: ‘రాబోయేవి ప్రమాదకరమైన రోజులు. నా బిడ్డలను కాపాడుకుండా’అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు రెండురోజులపాటు వైభవంగా నిర్వహించారు. ఆదివారం బోనాలు, సోమవారం రంగం నిర్వహించారు. పచ్చికుండపై నిలబడి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కరోనా నుంచి కాపాడాలని భక్తులు కోరగా.. ‘ఎవరు చేసిన కర్మను వాళ్లు అనుభవించాలి. రాబోయేవి చాలా ప్రమాదకరమైన రోజులు. అయినా నా బిడ్డల్ని నేను కాపాడుకుంటా. నాకు ఐదువారాల పాటు సాక పెట్టాలి. ప్రతి గడప నుంచి పలహారం అందాలి. ప్రజల కష్టాలను తొలగించడానికి నేనున్నా. మీ పూజలు తృప్తినివ్వడం లేదు. భక్తితో పూజలుచేయాలి. గంగమ్మ దేవికి యజ్ఞహోమాలు చేయాలి. రాష్ట్రమంతా సస్యశ్యామలమవుతది’అని తెలిపారు. 


logo