శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 24, 2020 , 00:48:44

లారీ బోల్తా.. డ్రైవర్‌, క్లీనర్‌ దుర్మరణం

లారీ బోల్తా.. డ్రైవర్‌, క్లీనర్‌ దుర్మరణం

అంతర్గాం: యాష్‌పాండ్‌ నుంచి బూడిద తరలించే లారీ బోల్తాపడి డ్రైవర్‌, క్లీనర్‌ దుర్మరణం చెందారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందనపల్లి పరిధిలోని రాజాపూర్‌ శివారులో ఆదివారం ఉదయం జరిగింది. ఎస్సై రామకృష్ణ వివరాల ప్రకా రం.. గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన పిల్లి శ్రీనివాస్‌ లారీ డ్రైవర్‌గా, ఎండీ అబ్దుల్‌ గఫూ ర్‌ క్లీనర్‌గా పనిచేస్తున్నారు. వీరు కుందనపల్లి శివారులోని యాష్‌పాండ్‌ నుంచి నిత్యం బూ డిద తరలిస్తుంటారు. రోజూవారీలాగే ఆదివారం బూడిద లోడు కోసం యాష్‌పాండ్‌కు వెళ్తున్న క్రమంలో  రాజాపూర్‌ శివారులోని మూలమలుపు వద్ద అదుపుతప్పి లారీ బోల్తా పడి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీనివాస్‌(30), గఫూర్‌ (26) అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు శ్రీనివాస్‌కు ఇద్దరు కొడుకులు రామ్‌తేజ(8), సాత్విక్‌తేజ(6) ఉండ గా, గఫూర్‌కు భార్య అఫ్రిన్‌, ఖుబ్రా(8 నెలలు) పాప ఉంది. గఫూర్‌ తండ్రి హనిస్‌కు ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 


logo