బుధవారం 20 జనవరి 2021
Telangana - Nov 28, 2020 , 21:19:38

బైక్‌ను లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

బైక్‌ను లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

ఖమ్మం : బైక్‌ను లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందాడు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు క్రాస్‌రోడ్డు వద్ద శనివారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. వివరాలివి.. తిరుమలాయపాలెం మండలం పాతర్ల పాడు గ్రామానికి చెందిన బాబురావు (35) వ్యక్తిగత పనులపై ఉదయం బైక్‌పై మహబూబాబాద్ జిల్లా మరిపెడ వెళ్లాడు. సాయంత్రం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు.

సుబ్లేడ్‌ క్రాస్‌రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాబూరావు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo