శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 14:24:49

పచ్చదనం పెంపొందించేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి

పచ్చదనం పెంపొందించేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి

హైదరాబాద్ : ఆరో విడుత హరితహారంలో భాగంగా గోషామహల్ పోలీస్ స్టేడియంలో హో మంత్రి మహమూద్ అలీ డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ  సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మానవ మనుగడలో చెట్లు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కావున సామూహికంగా మొక్కలు నాటాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు సిబ్బందితో అందరిని కలుపుకొని మొక్కలు నాటుతామన్నారు.


logo