వ్యాగన్ వర్క్‌షాప్‌కు భూములు

- రైల్వే అధికారులకు పత్రాలు ఇచ్చిన మంత్రి ఎర్రబెల్లి
వరంగల్, జనవరి 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాజీపేట రైల్వే జంక్షన్ సమీపంలో వ్యాగన్ పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్ ఏర్పాటుకు కీలక అడుగుపడింది. వర్క్‌షాపు కోసం అవసరమైన రూ.150.05 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖకు అప్పగించింది. ఈమేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్ విప్ వినయభాస్కర్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్, ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్ కలిసి సికింద్రాబాద్ రైల్వే ఏడీఆర్ సుబ్రహ్మణ్యంకు భూమి స్వాధీన పత్రాలు అందజేశారు. జాయింట్ సర్వే పూర్తి చేసిన తర్వాత మ్యుటేషన ప్రక్రియ చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి తెలంగాణకు న్యాయంగా రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని సాధిస్తామని అన్నారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ సహకారంతో ఉమ్మడి వరంగల్ ప్రజాప్రతినిధులదరం ఢిల్లీకి వెళ్తామని చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ ప్రజల చిరకాల ఆకాంక్ష అని పేర్కొన్నారు.
తాజావార్తలు
- నీటిగుంతలో మునిగి విద్యార్థి మృతి
- పెళ్లిపీటలెక్కబోతున్న హీరో.. ప్రియురాలితోనే ఏడడుగులు
- కోవిషీల్డ్ టీకానే వేయించుకుంటాం: ఢిల్లీ వైద్యులు
- నరసాపురం, అనకాపల్లి నుండి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైళ్లు
- ఏపీలో 1987కు తగ్గిన యాక్టివ్ కేసులు
- శాస్త్రవేత్తల నిర్విరామ కృషి ఫలితమే వ్యాక్సిన్ : మంత్రి ప్రశాంత్ రెడ్డి
- షాక్ ఇచ్చిన రోగి..ప్రాణం పోసిన డాక్టర్లు
- యూజీ ఆయుష్ వైద్య విద్య నీట్ అర్హత కటాఫ్ మార్కుల తగ్గింపు
- టీఆర్పీ స్కాం: ఐసీయూలో బార్క్ మాజీ సీఈవో
- 'వ్యాక్సిన్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి'