మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 01:32:15

ఏపీ కంటే ఇక్కడే సులువు

ఏపీ కంటే ఇక్కడే సులువు

మధిర: ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణలోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సులభంగా ఉన్నదని అక్కడి భూయజమానులు చెప్తున్నారు. ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మధిర, బోనకల్లు మండలాలకు రోజువారీగా వచ్చే స్లాట్‌బుకింగ్స్‌కు ఆంధ్రా నుంచి కూడా వస్తున్నారు. గతంలో మధిర, ఎర్రుపాలెం, బోనకల్లు మండలాలకు కలిపి మధిరలో ఒకే రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌ ఉండేది. ఇప్పుడు ప్రతి మండలంలోని తాసిల్దార్‌ ఆఫీస్‌లో భూములు రిజిస్ట్రేషన్‌ చేయించుకునే అవకాశం కల్పించడంతో తెలంగాణ-ఆంధ్రా బోర్డర్‌ లావాదేవీలు సులభంగా పూర్తవుతున్నాయి. ఇక్కడ భూములున్న ఏపీ ప్రజలు వచ్చి గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, వారసత్వ రిజిస్ట్రేషన్లను సులభంగా పూర్తి చేసుకొంటున్నారు. ఏకకాలంలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తవుతుండటంతో సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు. అవినీతికి తావులేకుండా సేవలు అందుతున్నాయని, రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా పోయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడే తొందరగా..

ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణలోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చాలా సులువుగా ఉన్నది. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఆళ్లపాడు గ్రామంలో నా పేరు మీద ఉన్న భూమిని నా కుమారుడికి గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించా. చాలా త్వరగా పూర్తయింది. ఇదే ఏపీలో అయితే రిజిస్ట్రేషన్‌ కోసం రోజుల తరబడి వేచి ఉండే పరిస్థితి. 

- పారా పద్మ, వత్సవాయి, కృషా ్ణజిల్లా, ఏపీ

ఆంధ్రా రైతుల సంతోషం

తెలంగాణలో భూక్రయవిక్రయాలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రాంత రైతులు ధరణిపై సంతోషం వ్యక్తంచేస్తున్నారు. 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేస్తుండటంపై సంబురపడుతున్నారు. బోనకల్లు మండలం ఆంధ్రా- తెలంగాణ సరిహద్దులో ఉన్నది. మన రాష్ట్రంలో భూములు కొంటున్న ఆంధ్రా ప్రాంతంవారు.. ఇక్కడకు వచ్చి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. ఏకకాలంలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ చేపడుతుండటంపై మంచి స్పందన వస్తున్నది. 

- రావూరి రాధిక, జాయింట్‌ 

సబ్‌రిజిస్ట్రార్‌, బోనకల్లు, ఖమ్మం జిల్లా