సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 18:13:40

చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి భూమి పూజ

చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి భూమి పూజ

ఆదిలాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆదిలాబాద్‌లో లక్ష ఎకరాలకు సాగు నీళ్లు అందించాలనే సదుద్దేశంతో ఎన్నో రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. చందా బ్రిడ్జి దగ్గర  రూ.4 కోట్ల 36 లక్షల వ్యయంతో నిర్మించనున్న చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌లో పెన్‌గంగాపై బ్యారేజీ పనులను ప్రారంభించామన్నారు. దీని ద్వారా 50 వేల ఎకరాలకు నీళ్లందిస్తామని తెలిపారు.

దీంతో పాటు మొదటి ఫేస్‌లో ఆరు చెక్ డ్యాంమ్‌ల పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. మరిన్ని చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.