గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 01:34:03

యారాండ్ల్ల మురిపెం

యారాండ్ల్ల మురిపెం

  • నిజామాబాద్‌ జిల్లాలో తోటికోడళ్ల పేరిట భూ రిజిస్ట్రేషన్‌

సోన్‌: నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం దూదిగాం గ్రామానికి చెందిన ఎం మానస, ఎం భాగ్యలక్ష్మి తోడికోడళ్లు. నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం మాదాపూర్‌ గ్రామానికి చెందిన భూలక్ష్మి నుంచి రెండునెలల కిందట 39 గుంటల భూమి కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. బుధవారం తాసిల్‌ ఆఫీస్‌లకు వెళ్లి.. ఆధార్‌కార్డులు, సాక్షుల, ఇతర అన్ని వివరాలు అందజేశారు. అధికారులు వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదుచేసి బయోమెట్రిక్‌ ద్వారా సంతకాలు తీసుకొని 15 నిమిషాల్లోపు రిజిస్ట్రేషన్‌ పూర్తిచేశారు. పత్రాలను అందించారు. మానస పేరిట 20 గుంటలు, భాగ్యలక్ష్మి పేరిట 19 గుంటల భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించారు. తక్కువ సమయంలోనే రిజిస్ట్రేషన్‌ పూర్తికావడంతో తోటికోడళ్లు మానస, భాగ్యలక్ష్మి సంతోషానికి అవధుల్లేవు.