శనివారం 06 మార్చి 2021
Telangana - Jan 20, 2021 , 18:28:46

ధ‌ర‌ణితో భూ రికార్డులు వ్య‌క్తుల చేతుల్లోంచి వ్య‌వ‌స్థ‌లోకి : మ‌ంత్రి హ‌రీశ్‌రావు

ధ‌ర‌ణితో భూ రికార్డులు వ్య‌క్తుల చేతుల్లోంచి వ్య‌వ‌స్థ‌లోకి : మ‌ంత్రి హ‌రీశ్‌రావు

మెద‌క్ : భూముల రికార్డులను వ్యక్తుల చేతుల్లో నుండి ధరణితో వ్యవస్థలోకి ప్రభుత్వం తెచ్చిందని రాష్ట్ర ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. మెదక్ జిల్లాలో ధరణిపై మంత్రి హరీశ్ రావు బుధ‌వారం సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు మేలు‌ చేసే ఉద్దేశంతోనే, భూ త‌గాదాల శాశ్వ‌త ప‌రిష్కారానికే ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను తీసుకువ‌చ్చిన‌ట్లు చెప్పారు. స్వాతంత్ర్యం ‌వచ్చి 70 ఏళ్లు అయినా భూ తగాదాలు‌ పరిష్కారం కావడం లేద‌న్నారు. పోలీస్‌స్టేషన్లలో అన్నీ భూ తగాదాలేన‌న్నారు. దేశంలో ఈ సమస్య పరిష్కారం కోసం ఆలోచించిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. లంచాలు ‌లేకుండా, పారదర్శకంగా పట్టా పాస్‌బుక్‌లు ఇచ్చేందుకే ధరణి అన్నారు. ధరణితో రిజిస్ట్రేషన్ల‌ వ్యవస్థ ప్రజల అందుబాటులోకి వచ్చిందన్నారు. ధ‌రణి ఏర్పాటు వల్ల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం భూముల విషయాల్లో తలదూర్చే అవకాశం లేనంత పారదర్శకంగా ఉందన్నారు. VIDEOS

logo