సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 17:41:48

ల్యాండ్‌పూలింగ్‌లో యజమానుల వాటా పెంపు

ల్యాండ్‌పూలింగ్‌లో యజమానుల వాటా పెంపు

హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూ యజమానులకు 10 శాతం వాటా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భూ యజమానులకు 60 శాతం, హెచ్‌ఎండీఏకు 40 శాతం వరకు వాటా రానుంది. గతంలో భూయజమానులకు 50 శాతం, హెచ్‌ఎండీఏకు 50 శాతంగా ఉన్నది. ల్యాండ్‌పూలింగ్‌ భూములకు భద్రత, ప్రయోజనం చేకూరుస్తామని హెచ్‌ఎండీఏ వెల్లడించింది.

ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములిచ్చేవారికి సమస్య లేకుండా చూస్తామని, అన్నిరకాల అనుమతుల వ్యవహారాలు తామే చూస్తామని తెలిపింది. భూములిచ్చిన వారి రిజిస్ట్రేషన్‌ ఖర్చులు కూడా భరిస్తామని పేర్కొంది. లేఔట్‌, ముసాయిదా ఆమోదం పొందిన 6 నెలల్లో భూ యజమానులకు ప్లాట్లు కేటాయిస్తామని తెలిపింది. అలా కేటాయించిన ప్లాట్లను యజమానులు వారి ఇష్టానుసారం విక్రయించుకోవచ్చని చెప్పింది. హెచ్‌ఎండీఏ పరిధిలో 500 ఎకరాల్లో ల్యాండ్‌ పూలింగ్‌ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించింది.


logo