శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Sep 26, 2020 , 03:17:58

ప్రాణాలు తీసిన భూతగాదా

 ప్రాణాలు తీసిన భూతగాదా

  • పట్టపగలే కత్తితో దాడి.. ఇద్దరు మృతి

పెబ్బేరు రూరల్‌: పొలం పంచాయతీలో రక్తం చిమ్మింది. దాయాదుల మధ్య చాలా ఏండ్లుగా నెలకొన్న గట్టు తగాదా ఇద్దరి హత్యకు దారితీయగా.. ప్రతి దాడిలో నిందితుడికి తీవ్ర గాయాలైన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాఖాపూర్‌లో పట్టపగలే చోటుచేసుకున్నది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. ఏటిగడ్డ శాఖాపూర్‌కు చెందిన గువ్వల శాంతయ్యకు అతని దాయాదులతో చాలాకాలంగా భూతగాదాలు ఉన్నాయి. వీరి సమస్యను పరిష్కరించేందుకు శుక్రవారం గ్రామ పెద్దలు సమావేశమయ్యారు. అక్కడ దాయాదుల మధ్య మాటామాటా పెరగడంతో పరశురాముడు కత్తితో ప్రత్యర్థి గువ్వల శాంతయ్య(60)పై దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆయన సమీప బంధువు రామకృష్ణ అలియాస్‌ పాండు(24)పైనా తిరగబడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ వీరిని పెబ్బేరు పీహెచ్‌సీకీ తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వనపర్తి ఏరియా దవాఖాన కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఇద్దరూ మృతి చెందారు. శాంతయ్య సంబంధీకులు ఆగ్రహంతో అక్కడే ఉన్న పరశురాముడిపై ప్రతి దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి.