బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 16:50:52

గ్రామ పంచాయతీ కి భూమి విరాళం

గ్రామ పంచాయతీ కి భూమి విరాళం

హైదరాబాద్ : పుట్టిన ఊరు, కన్నతల్లి రుణం తీర్చుకోవాలని భావించిన ముగ్గురు సోదరులు, తమ సొంతూరు కి కొంత మేలు చేయాలని భావించారు. వెంటనే ఆచరణలో చేపట్టారు. మాశెట్టి ఉపేందర్, మశెట్టి మాశెట్టి కృష్ణ, మాశెట్టి వెంకటేష్ తోబుట్టు వులు. వల్మిడి గ్రామానికి చెందిన మాశెట్టి సోమయ్య, కనక మహాలక్ష్మి కొడుకులు. ముగ్గురు సోదరులు, హైదరాబాద్ లో స్థిర పడ్డారు. తాము హైదరాబాద్ లో ఉంటున్న కారణంగా గ్రామంలోని ఇల్లు, తమ తల్లి తండ్రుల మరణానంతరం శిథిలావస్థకు చేరింది.

తమ తల్లితండ్రుల జ్ఞాపకార్థం ఆ ఇంటి స్థలాన్ని గ్రామ పంచాయతీకి ఇవ్వాలని నిర్ణయించారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో సంబంధిత రిజిస్ట్రేషన్ పేపర్లని గ్రామ సర్పంచ్ కి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దాతలను అభినందించారు. logo