సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 10:55:20

పాతబస్తీ లాల్‌ దర్వాజ బోనాలు ప్రారంభం

పాతబస్తీ లాల్‌ దర్వాజ బోనాలు  ప్రారంభం

హైదరాబాద్‌:  పాతబస్తీ లాల్‌ దర్వాజ బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం వేకువజామున 3 గంటలకు అర్చకులు  అమ్మవారికి   జల కడవ సమర్పించారు.  సాయంత్రం 6 గంటలకు అమ్మవారి శాంతి కళ్యాణం జరగనుంది.   అక్కన్న మాదన్న ఆలయంతో పాటు  అన్ని పురాతన అమ్మవారి ఆలయాల్లో   పూజలు మొదలయ్యాయి. 

రేపు రంగం, బలిగంప, పోతురాజుల గావు కార్యక్రమాలు జరగనున్నాయి. బోనాల పండుగ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్‌ లక్మీనారాయణ గౌడ్‌ కుటుంబ సభ్యులు అమ్మవారికి బోనం సమర్పించారు.    

కరోనా వ్యాప్తి దృష్ట్యా భక్తులు లేకుండా, కేవలం ఆలయ కమిటీ సభ్యులతోనే బోనాల వేడుకలను అధికారులు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల నేపథ్యంలో నాగుల చింత నుంచి లాల్‌దర్వాజ రహదారిని, ఓల్డ్‌ ఛత్రినాక పీఎస్‌, గౌలిపురా నుంచి లాల్‌దర్వాజ వెళ్లే మార్గాలను పోలీసులు మూసివేశారు.
logo