బుధవారం 03 మార్చి 2021
Telangana - Jan 24, 2021 , 19:40:47

యాదాద్రి..కేసీఆర్‌ కలల ప్రాజెక్టు: మంత్రి కేటీఆర్‌

యాదాద్రి..కేసీఆర్‌ కలల ప్రాజెక్టు: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: అణువణువునా ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం   అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది.  సంప్రదాయాలు, ఆగమశాస్త్ర నియమాలను పాటిస్తూ నిర్మాణం జరుగుతోంది.  యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ  పునరుద్ధరణ  సీఎం కేసీఆర్‌ కలల ప్రాజెక్ట్ అని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 

ఓవైపు ప్రతిష్టాత్మక కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టు వంటి ఆధునిక దేవాలయాలను నిర్మిస్తున్న కేసీఆర్‌.. అదే సమయంలో ప్రపంచస్థాయి అధ్యాత్మిక విశ్వనగరిగా యాదాద్రిని తీర్చిదిద్దుతున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు.  ఈ సందర్భంగా యాదాద్రికి ఆలయానికి సంబంధించిన వీడియోను కేటీఆర్‌ పంచుకున్నారు. 

VIDEOS

logo