కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘రాజా విక్రమార్క’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీ సరిపెల్లి దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టైటిల్‌ను ఆదివారం దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా సోషల్‌మీడియా ద్వారా విడుదలచేశారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ)లో కొత్తగా ఉద్యోగంలో చేరిన యువకుడిగా కార్తికేయ కనిపిస్తారు. అతడిపై తెరకెక్కించిన పోరాట ఘట్టాలు రొమాంచితంగా ఉంటాయి. తమిళ నటుడు రవిచంద్రన్ మనవరాలు తాన్య రవిచంద్రన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది’ అని తెలిపారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నదని, త్వరలో బ్యాలెన్స్ షూటింగ్‌ను పూర్తిచేసి విడుదల తేదీని వెల్లడిస్తామని నిర్మాత పేర్కొన్నారు. సుధాకర్ కోమాకుల, సాయికుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి, సినిమాటోగ్రఫీ: పి.సి.మౌళి.