శనివారం 04 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 19:24:49

లక్నవరంలో ఈనెల 8 నుంచి పర్యాటకులకు అనుమతి

లక్నవరంలో ఈనెల 8 నుంచి పర్యాటకులకు అనుమతి

గోవిందరావుపేట: పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్న లక్నవరం సరస్సులోని 3వ ఐలాండ్‌ వద్ద కొత్తగా 15 టెంటెడ్‌ అకామిడేషన్‌ కాటేజీలను నిర్మించనున్నట్లు టీఎస్‌ టీడీసీ ఎండీ బోయినపల్లి మోహన్‌రావు తెలిపారు. శనివారం ఆయన 2వ ఐలాండ్‌లో నిర్మిస్తున్న 8 కాటేజీలతో పాటు ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు. మరో నెల రోజుల్లో వర్షాలు కురిసి సరస్సు పూర్తిస్థాయిలో నిండుకోనున్న నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఈ నెల 8నుంచి పర్యాటక సేవలు పునః ప్రారంభం కానున్నట్లు ఎండీ మనోహర్‌రావు వెల్లడించారు. కరోనా వైరస్‌ నివారణలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన సేవలు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మంగళవారం నుంచి మొదలవుతాయని తెలిపారు. 


logo