ముంబై ,జూన్ 16: భారత మార్కెట్లో పలు ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీలు ప్రారంభమయ్యాయి. వీటిలో ఒకటి ఎలక్ట్రిక్ 2-వీలర్ తయారీ సంస్థ హాప్ఎలక్ట్రిక్ మొబిలిటీ. హాఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి కనీసం 5 ఎలక్ట్రిక్-వెహికల్ సొల్యూషన్స్‌ను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నది. దీనికోసం జైపూర్‌లోని ప్రొడక్షన్ యూనిట్ ను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ ఏడాదికి 50,000 వాహనాలను ఉత్పత్తి చేస్తుంది.
ప్రస్తుతం హాఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ హాఫ్ లియో ,హాఫ్ లైఫ్ అనే రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది. త్వరలో మరో ఈ-మోటర్‌బైక్‌ను విడుదల చేయనున్నది. హాఫ్ ఈ-వెహికల్ సొల్యూషన్స్ విస్తృతమైన ఆర్ అండ్ డి పరిశోధనలపై ఆధారపడి ఉంటాయి. వీటి ధర రూ. 65,500 నుంచి మొదలవుతుంది. జైపూర్‌లోని ప్రొడక్షన్ యూనిట్ లో ఉత్పత్తిని 1 లక్ష యూనిట్లకు పెంచవచ్చు. 2022 నాటికి, దక్షిణ భారతదేశంలో కొత్త ఉత్పాదక విభాగాన్ని ఏర్పాటు చేయాలని బ్రాండ్ యోచిస్తోంది, ఇది సంవత్సరానికి కనీసం 5 లక్షల యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.