శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 10:47:45

నేడు కేఎంసీకి కరోనా బయో సేఫ్టీ క్యాబినెట్‌ పరికరం

నేడు కేఎంసీకి కరోనా బయో సేఫ్టీ క్యాబినెట్‌ పరికరం

వరంగల్‌: ప్రస్తుతం కేఎంసీలో వైరల్‌ రీసెర్చ్‌ డయాగ్నొస్టిక్‌ ల్యాబొరేటరీ సిద్ధంగా ఉండటంతో అన్ని రకాల పరీక్షలు చేయడానికి అవకాశం ఏర్పడింది. ఇందులో భాగంగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను నిర్ధారించే ఆధునిక పరికరమైన బయో సెఫ్టీ క్యాబినెట్‌ ఆదివారం కేఎంసీకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జర్మనీలో కొనుగోలు చేసిన ఈ పరికరం పడవలో చెన్నైకి చేరుకోగా కంటైనర్‌ ద్వారా వరంగల్‌కు తీసుకొస్తున్నారు. ఆదివారం వరకూ కంటైనర్‌ వరంగల్‌ చేరుకోనుంది. ప్రిన్సిపాల్‌ సెక్రటరీ ఆదేశంతో ఈ నెల 22 వరకు ల్యాబొరేటరీలో కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రారంభించాలని అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. 


logo