గురువారం 28 మే 2020
Telangana - May 09, 2020 , 17:42:15

సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు

సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు మద్దతు తెలుపుతూ శనివారం పలువురు ప్రముఖులు,  సంస్థల ప్రతినిధులు సీఎం సహాయనిధికి విరాళాలను అందించారు. రూ.3కోట్ల విలువైన పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లను ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైల్‌ హైదరాబాద్‌ ఎండీ కేవీబీ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి అందజేశారు. దీనికి సంబంధించిన లేఖను ఎన్వీఎస్‌ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌కు అందించారు. 

ఐటీసీ సీఎండీ సంజీవ్‌ పూరి ఇచ్చిన రూ.2కోట్ల  చెక్కును తెలంగాణ ఐటీసీ సీఈవో సంజయ్‌ సింగ్‌.. కేటీఆర్‌కు అందించారు. పోచంపాడ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ రూ.కోటి విలువైన పీపీఈ కిట్లు అందించింది. మరికొంత మంది దాతలు విరాళానికి సంబంధించిన చెక్కులను కేటీఆర్‌ను కలిసి అందజేశారు. సీఎం సహాయనిధికి విరాళాలు అందజేసిన వారికి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.


logo